Dailyhunt
భర్త చనిపోయినా.. మామ తీరు నచ్చింది.. అంతే పెళ్లి చేసేసుకుంది...

భర్త చనిపోయినా.. మామ తీరు నచ్చింది.. అంతే పెళ్లి చేసేసుకుంది...

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్‌లో గౌతమ్ సింగ్, ఆర్తి సింగ్ అనే దంపతులు నివసిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే భర్త రెండేళ్ల క్రితం మరణించాడు. భర్త మరణించాక భార్య ఆర్తి సింగ్ మామ గారింట్లోనే ఉంటోంది. కానీ మామగారిది రాజ్ పుత్ వంశస్థులు. రాజ్ పుత్ వంశంలో స్త్రీలు పెద్దగా బయటకు రారు. రెండేళ్ల పాటు ఆర్తి సింగ్ ఇంట్లోనే ఉండిపోయింది.

అయితే, క్షత్రియ ఆచారం ప్రకారం మహిళలకు పునర్వివాహం చెయ్యొచ్చు. ఇదే విషయాన్ని ఆర్తి సింగ్ మామ కృష్ణా రాజపుత్ సింగ్ క్షత్రియ మహాసభ కమ్యూనిటీ ముందుకు తీసుకొచ్చారు. రెండేళ్లుగా మామ తనను చూసుకుంటున్న తీరు నచ్చి ఆ యువతి మామను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది.

దీంతో క్షత్రియ సంప్రదాయం ప్రకారం కొద్దిమంది సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu