Dailyhunt
భర్త కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన తాహసీల్దార్ భార్య (వీడియో)

భర్త కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన తాహసీల్దార్ భార్య (వీడియో)

మహిళ తన భర్త కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఎమ్మార్వో (తాహసీల్దారు) అయిన తన భర్త గత ఐదేళ్లుగా పరాయి మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తమను నిరాదారణకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు.
తన భర్తను రక్షించి తమ వద్దకు చేర్చాలని ఆమె పోలీసులను మొరపెట్టుకున్నారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో వెలుగు చూసింది.

ఈ వివరాలను పరిశీలిస్తే, ములుగు జిల్లా వెంకటాపూర్ ఎమ్మార్వోగా గిరిబాబు అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యాపిల్లలను పట్టించుకోవడం లేదని భార్య ఝన్సీరాణి ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, తమను పూర్తిగా వదిలివేసి ఆమెతోనే సహజీవనం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.

ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని పలుమార్లు కోరినా ఎమ్మార్వో కావడంతో అధికారంతో తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ మానసికంగా వేధిస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. తన భర్తను తీసుకొచ్చి తమకు న్యాయం చేయాలంటూ హన్మకొండ పోలీస్ స్టేషనులో ఝాన్సీరాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu