ఏపీలోని తిరుపతి జిల్లాలో ఓ దారుణం జరిగింది. తన బిడ్డను పాఠశాలలో చేర్పించేందుకు వచ్చిన భార్యకు మాయ మాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లిన భర్తను ఆమెను అతి కిరాతకంగా హత్య చేసి పారిపోయాడు.
ఈ గ్రామానికి చెందిన పనబాక సంధ్య (35) అనే మహిళకు భర్త శ్రీనివాస రావు ఉన్నాడు. మద్యానికి, గంజాయికి బానిసైన శ్రీనివాస రావు వేధింపులను భరించలేక, సంధ్య కొంతకాలంగా తన పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో తమ కుమారుడిని పాఠశాలలో చేర్పించేందుకు సంధ్య గ్రామానికి రాగా, ఆమె భర్త మాయమాటలు చెప్పి ఆమెను తనతో పాటు తీసుకెళ్లాడు.
మరుసటి రోజు ఉదయం ఇంటి సమీపంలో ఆమె మృతదేహం చీరతో కప్పబడి కనిపించింది. ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న భర్త ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

