Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్రెయిన్ స్ట్రోక్‍తో మృతి చెంది పలువురి జీవితాల్లో వెలుగులు (వీడియో)

బ్రెయిన్ స్ట్రోక్‍తో మృతి చెంది పలువురి జీవితాల్లో వెలుగులు (వీడియో)

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా వాసి ఒకరు తాను మృతి చెందుతూ అనేక మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్‌ అయిన జిల్లాలోని కడెం మండలం, కొండుకూర్‌కు చెందిన వెంకటేశ్వర రావు అనే వ్యక్తి మరణానంతరం కూడా పలువురికి జీవం కల్పించారు.
మృతుని కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించడంతో ఆయన గుండె చప్పుడు ఆగినా మరికొందరి జీవితాల్లో కొత్త ఆశ చిగురింపజేసింది. ఈ మానవతా నిర్ణయానికి యశోద ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సెల్యూట్ చేశారు. ఆవయవదానం ఒక జీవితానికి ముగింపు కాదు. ఎన్నో జీవితాలకు కొత్త ప్రారంభమే సందేశాన్ని ఈ కుటుంబం ఆచరణలో చూపించిందని అనేక మంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu