Dailyhunt
Charmee Kaur: విజయ్ విజయం.. త్రిష లక్కీ మస్కట్ అన్న ఛార్మీ కౌర్

Charmee Kaur: విజయ్ విజయం.. త్రిష లక్కీ మస్కట్ అన్న ఛార్మీ కౌర్

Charmee Kaur

టీవీకే అధినేత విజయ్ ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుండి, నటి త్రిష కృష్ణన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. కాకతాళీయంగా, ఈ విజయం సరిగ్గా త్రిష పుట్టినరోజు (మే 4) నాడే సంభవించడం, విజయ్‌కి వ్యక్తిగతంగా ఒక విశేష ఘట్టంగా నిలిచింది.
ప్రస్తుతం విజయ్ సేతుపతి నటిస్తున్న 'స్లమ్‌డాగ్' చిత్రాన్ని నిర్మిస్తున్న నటి, నిర్మాత ఛార్మీ కౌర్, త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఆమెను విజయ్ రాజకీయ విజయానికి ముడిపెడుతూ.. త్రిషను ఒక లక్కీ మస్కట్.. అదృష్ట చిహ్నంగా అభివర్ణించారు.

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా, చార్మీ త్రిషతో కలిసి దిగిన ఒక చిత్రాన్ని పంచుకుంటూ ఇలా రాసింది.

"నీ ప్రత్యేకమైన రోజున, ప్రత్యేకమైన వేడుకలు. నువ్వు నిజంగా ఒక అదృష్ట దేవతవి. ఈ పుట్టినరోజు చరిత్ర పుటల్లోనూ, పట్టుదలకు సంబంధించిన గ్రంథాల్లోనూ ఒక విజయ చిహ్నంగా నిలిచిపోతుంది. నేను ఎప్పుడూ చెప్పేట్లుగానే... ఓపికే ముఖ్యం. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు" అని ఛార్మీ వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu