దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు సమాధి దుస్థితిపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరలవుతున్నాయి. ఓ నెటిజన్ షేర్ చేసిన వీడియోకు మంచు మనోజ్ స్పందించారు.
'సమాధి దుస్థితి చూసి చాలా బాధేసింది. ఇక్కడకు వచ్చి మూడేళ్లవుతోంది. అప్పుడు కూడా ఇలానే ఉంటే శుభ్రం చేశాం. సోషల్ మీడియాలో వైరలైన వీడియో నాకు మా టీమ్ శుక్రవారం రాత్రి షేర్ చేసింది. ఈరోజు ఉదయాన్నే వచ్చి క్లీన్ చేసి షూటింగ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నా' అని మనోజ్ చెప్పారు.
శనివారం దాసరి నారాయణ రావు వర్థంతి కావడంతో విగ్రహం వద్దకు వెళ్లి దండం పెట్టుకోవాలనుకున్నానని కానీ, వీడియో చూసి సమాధి వద్దకు వచ్చినట్లు చెప్పారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి నివాళులర్పించారు.

