Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధోనీ పేరిట వున్న రికార్డును బ్రేక్ చేసిన శ్రేయాస్ అయ్యర్

ధోనీ పేరిట వున్న రికార్డును బ్రేక్ చేసిన శ్రేయాస్ అయ్యర్

Shreyas Iyer

భారత క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో టాస్ గెలిచి అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త మైలురాయిని చేరుకున్నాడు.
ఇంకా వరుసగా శ్రేయాస్ అయ్యర్ ఎనిమిది సార్లు టాస్ గెలవడం విశేషంగా మారింది.

ఇప్పటి వరకు ఈ రికార్డు బహామాస్‌కు చెందిన కెప్టెన్ గ్రెగరీ టేలర్ పేరిట ఉండేది. ఆయన వరుసగా ఏడు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో టాస్ గెలిచి ప్రత్యేక గుర్తింపు పొందారు. తాజాగా శ్రేయాస్ అయ్యర్ ఆ రికార్డును అధిగమించి వరుసగా ఎనిమిది టాస్‌లు గెలిచిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో శ్రేయాస్ అయ్యర్ వ్యక్తిగతంగా అరుదైన రికార్డు సాధించినా, జట్టు ప్రదర్శనను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భారతీయ కెప్టెన్ల విషయానికొస్తే, టీ-20లలో వరుసగా అత్యధిక సార్లు టాస్ గెలిచిన రికార్డు గతంలో ఎం.ఎస్. ధోనీ పేరిట ఉండేది. ధోనీ 2010 మే, 2012 ఫిబ్రవరి మధ్య భారత టీ20 కెప్టెన్‌గా వరుసగా ఏడు సార్లు టాస్ గెలిచారు. ఈ విజయం తర్వాత, జట్టు ప్రదర్శనను అయ్యర్ ప్రశంసించారు; కెప్టెన్‌గా తన తొలి విజయాన్ని నమోదు చేయడం ఒక ప్రత్యేకమైన క్షణమని ఆయన పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu