Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డీకే మంత్రివర్గంలో నా కొడుక్కీ కీలక పదవి ఇవ్వాల్సిందే : రాహుల్ వద్ద సిద్ధు డిమాండ్

డీకే మంత్రివర్గంలో నా కొడుక్కీ కీలక పదవి ఇవ్వాల్సిందే : రాహుల్ వద్ద సిద్ధు డిమాండ్

ర్నాటక రాష్ట్రంలో డీకే శివకుమార్ సారథ్యంలో ఏర్పాటుకానున్న మంత్రివర్గంలో తన కుమారుడు యతీంద్రకు కీలకమైన మంత్విత్వశాఖను కేటాయించాల్సిందేనంటూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య పట్టుబడుతున్నారు.
ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వద్ద డిమాండ్ చేస్తున్నారు.

గురువారం సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన తన ముఖ్య అనుచరులతో కలిసి ఢిల్లీకి వెళ్ళిన విషయం తెల్సిందే. శుక్రవారం ఆయన రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన కుమారుడు యతీంద్రకు కీలకమైన మంత్రిత్వశాఖను కేటాయించాలని సిద్ధూ హైకమాండ్‌ను కోరినట్లు తెలుస్తోంది.

అలాగే, తనకు రాజ్యసభకు వచ్చేందుకు తనకు ఆసక్తి లేదని.. కర్ణాటక రాజకీయాల్లోనే ఉండాలని అనుకుంటున్నట్లు సిద్ధూ తెలిపారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందరు రాహుల్‌కి సిద్ధరామయ్య ధన్యవాదాలు తెలిపారు.

సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు. సీఎం పదవికి సిద్ధరామయ్య గురువారం రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఈ రాజీనామాను గవర్నర్ శుక్రవారం ఆమోదించారు.

గురువారం గవర్నర్‌ గెహ్లాట్ మధ్యప్రదేశ్‌ పర్యటనలో ఉండటంతో లోక్‌భవన్‌కు వెళ్లిన సిద్ధరామయ్య... గవర్నర్‌ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్‌కు రాజీనామాపత్రం సమర్పించారు. అర్థరాత్రి మధ్యప్రదేశ్‌ నుంచి తిరిగి బెంగళూరు చేరుకున్న గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ శుక్రవారం ఉదయం సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు. తదుపరి సీఎం ఎంపిక వరకు ఆపద్ధరమ్మ సీఎంగా ఆయనే కొనసాగనున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య పలువురు సీనియర్‌ నేతలతో కలిసి గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనాయకులతో ఆయన భేటీకానున్నారు. కర్ణాటకలో తదుపరి ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu