Dailyhunt
ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతం... డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతం... డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

రాన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక చేశారు. ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం రాత్రికి ఇరాన్ నాగరికత మొత్తం అంతమవుతుందని అన్నారు.
ఇలా అంతమయ్యే నాగరికతను ఇకపై ఎప్పటికీ పునరుద్ధరించలేరని, తన ట్విట్టర్ ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు చేశారు. ఇరాన్‌లో గత 47 యేళ్లుగా ఉన్న అవినీతి, అరాచక పాలన అంతం కానుందందని, ప్రపంచ చరిత్రలో ఈ రాత్రి ఓ మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఆ దేశాన్ని తుడిచిపెట్టడం నిజానికి తనకు ఇష్టం లేదని, కానీ ఆ విధంగా చేయక తప్పట్లేదని పేర్కొన్నారు. అయితే, ఇరాన్‌లో కొత్త, తెలివైన నాయకత్వం వచ్చిందని, దానివల్ల అద్భుతాలు జరిగే అవకాశం కూడా ఉందన్నారు.

కాగా, మరికొన్ని గంటల్లో ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధిని తెరవకపోతే ఆ దేశంలోని ఇరాన్‌లో వంతెనలు, విద్యుత్ కేంద్రాలను లక్ష్యం చేసుకుంటామని సోమవారం ట్రంప్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అమెరికా ప్రతిపాదనలను ఇరాన్‌ తిరస్కరించడంతో.. ట్రంప్‌ తాజాగా మరోసారి హెచ్చరికలు చేశారు. ఇరాన్‌లోని పౌర, మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే.. అంతర్జాతీయ నేరంగా పరిగణిస్తామని ఐక్యరాజ్య సమితి చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరించినప్పటికీ అమెరికా దాడులు కొనసాగిస్తోంది.

మరోవైపు, ట్రంప్‌ వ్యాఖ్యలపై ఇరాన్‌ స్పందించింది. ఈ రాత్రికి ఇరాన్‌ నాగరికత తుడిచి పెట్టుకోబోతోందంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టింది. అమెరికా, దాని మిత్రదేశాలే పురాతన నాగరికత కలిగిన ఇరాన్‌ నుంచి మరిచిపోలేని దెబ్బను రుచి చూస్తారంటూ పేర్కొంది. ఈ మేరకు దక్షిణ ఆఫ్రికాలోని ఇరాన్‌ ఎంబసీ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu