Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ సమస్యలున్నవారు దానిమ్మ కాయలు తినకూడదు, ఏంటవి?

ఈ సమస్యలున్నవారు దానిమ్మ కాయలు తినకూడదు, ఏంటవి?

హజంగా పండ్లను ఎవరైనా తినవచ్చు అంటారు కానీ కొన్ని పండ్లను కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వున్నవారు తినకూడదు. దానిమ్మ పండ్లను కూడా కొన్ని అనారోగ్య సమస్యలు, ఎలర్జీలు వున్నవారు తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అవేంటో తెలుసుకుందాము.

శస్త్రచికిత్స చేయించుకునేవారు దానిమ్మను తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లు ఎనస్తీషియా మందులతో చర్యను పొంది శస్త్ర చికిత్స సమయంలో అధిక రక్తస్రావం కావడానికి కారణం అవుతాయి. అందువల్ల శస్త్ర చికిత్సకు ముందు కనీసం 2 వారాలు ఈ పండ్లను తినవద్దని వైద్యులు సలహా ఇస్తారు.

అలాగే కొన్ని రకాలైన ఔషధాలను వాడేవారు కూడా వీటికి దూరంగా వుండాలి. కొన్ని ఔషధాలు తీసుకున్నప్పుడు దానిమ్మను తిన్నట్లయితే అది కాలేయం పనితీరుపై ప్రభావం చూపే అవకాశం వుంటుంది.

లోబీపీ వున్నవారు కూడా వీటిని తినడం తగ్గించేయాలి. ఎందుకంటే దానిమ్మలో రక్తపోటును తగ్గించే కారకాలైన యాంటిఆక్సిడెంట్లు, పొటాషియం వుంటాయి. కనుక దానిమ్మను తీసుకుంటే రక్తపోటు స్థాయిల్లో తేడా రావచ్చు. ముఖ్యంగా అప్పటికే లోబీపి వున్నవారు ఈ పండ్లకు దూరంగా వుండటం మంచిది.

అలాగే జీర్ణాశయ సమస్యలున్నవారు కూడా ఈ పండ్లను తినకుండా వుండటమే మంచిది. ఒకవేళ తినాలనిపిస్తే వైద్యుల సలహా తీసుకోవచ్చు. కొంతమందికి ఎలర్జీ సమస్యలుంటాయి. అలాంటివారు కూడా దానిమ్మకు దూరంగా వుండాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu