Fatima Sana
జింబాబ్వేపై కేవలం 15 బంతుల్లోనే 50 పరుగులు సాధించడం ద్వారా, పాకిస్థాన్‌కు చెందిన ఫాతిమా సనా మహిళల టీ-20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన అర్ధశతకం సాధించిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.న్యూజిలాండ్‌కు చెందిన సోఫీ డివైన్, ఆస్ట్రేలియాకు చెందిన ఫోబ్ లిచ్‌ఫీల్డ్, భారత క్రీడాకారిణి రిచా ఘోష్‌లు సంయుక్తంగా నెలకొల్పిన 18 బంతుల అర్ధశతకం రికార్డును సనా బద్దలు కొట్టింది. పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకోవడంతో, కెప్టెన్ తన ఇన్నింగ్స్‌లోని మొదటి బంతి నుంచే చెలరేగి, పాయింట్ మీదుగా బౌండరీ కొట్టింది.
10 ఫోర్లు, రెండు సిక్సర్లు బాదిన ఆమె, 326 స్ట్రైక్ రేట్‌తో ఆడిన తన ఇన్నింగ్స్‌లో జింబాబ్వే పేస్ బౌలింగ్‌ను చిన్నాభిన్నం చేసింది. ఊహించిన విధంగానే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికైన సనా, పాకిస్తాన్ 20 ఓవర్లలో 223-4 స్కోరు చేయడంలో సహాయపడింది.
అంతేకాకుండా, 17.1 ఓవర్లలో జింబాబ్వే 90 పరుగులకే ఆలౌట్ కాగా, ఆమె ఒక వికెట్ కూడా పడగొట్టింది. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్‌కు అత్యుత్తమ క్రీడాకారిణిగా ఉన్న సనా, ముఖ్యంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన బ్యాటింగ్‌ను మరింత మెరుగుపరుచుకుంది. ఈ 24 ఏళ్ల క్రీడాకారిణి, ప్రపంచ కప్ ఫైనలిస్ట్ అయిన దక్షిణాఫ్రికాపై రెండు వన్డే అంతర్జాతీయ అర్ధశతకాలు కూడా సాధించింది. కరాచీలో జన్మించిన ఈ క్రీడాకారిణి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన చివరి 10 మ్యాచ్‌లలో 18 వికెట్లు తీసి, 283 పరుగులు చేసింది.

