గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఘోరం జరిగింది. భుజ్ - ఖవ్దా జాతీయ రహదారిపై కారు, ట్రక్కు ఢీకొన్నాయి. శనివారం రాత్రి జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కచ్ పశ్చిమ పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారి వెల్లడించిన వివరాల మేరకు... బాధితులంతా ఉత్తరాంఖండ్‌లోని గఢ్వాల్ ప్రాంతానికి చెందినవారు. వీరు 'రాన్ ఆఫ్ కచ్' పర్యాటక ప్రాంతాన్ని సందర్శించి తిరిగి భుజ్‌కు వస్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు ప్రమాదస్థలిలోనే ప్రాణాలు విడిచారు.
మృతుల్లో మూడు నెలల పసికందు కూడా ఉండటం గమనార్హం. ప్రమాద తీవ్రతకు మృతదేహాలు పూర్తిగా చిద్రమై వాహనంలోనే ఇరుక్కునిపోయాయి. వాటిని బయటకు తీయడానికి సహాయక సిబ్బంది ఎంతగానో శ్రమించడంతో పాటు గంటల కొద్ది సమయం పట్టింది. సమచారం తెలుసుకునన జిల్లా ఎస్పీ వికాస్ సుంద ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

