అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతర్జాతీయస్థాయిలో 'ఆపరేషన్ హార్డ్‌బాల్'ను చేపట్టింది. దానిలో భాగంగా అమెరికా, కెనడా, ఐరోపావ్యాప్తంగా బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన 24 మంది మంది అనుమానితులు అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలోనే బిష్ణోయ్, గోల్డీబ్రార్ అభియోగాలు నమోదయ్యాయి. గోల్డీపై 50,000 డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ 2023లో బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెనక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ అప్పట్లో కెనడా ప్రధానిగా ఉన్న ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. వీటిని భారత్ తీవ్రంగా ఖండించింది. వాటిని సమర్థించే ఆధారాలు ఇవ్వాలని.. ఆ తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని పలుమార్లు స్పష్టంచేసింది.
అయినప్పటికీ కెనడా ఈ ఆరోపణలు చేయడం మానుకోలేదు. అక్కడితో ఆగకుండా ఈ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మ పేరును చేర్చడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. దీంతో ఇరుదేశాలు పరస్పరం దౌత్యవేత్తలను వెనక్కి పంపించాయి కూడా. తర్వాత మార్క్ కార్నీ అధికారంలోకి వచ్చాక సంబంధాల్లో పునరుద్ధరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

