Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి

ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి

గుండె పోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. అంతా ఆరోగ్యంగా వున్నా అలా హఠాత్తుగా ఎలా చనిపోయారని కొంతమంది అనుకుంటుంటారు. కానీ గుండె పోటు వచ్చే ముందు హెచ్చరిక సంకేతాలు శరీరం ఇస్తుంది.
అవేమిటో తెలుసుకుందాము.

అవసరమైనంత సమయం... అంటే గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం

గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం

ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం

లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం

కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం

గుండెల్లో భారంగా అనిపించడం, ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం.

విశ్రాంతి లేనట్లుగానూ, చిన్నచిన్న విషయాలకే తీవ్ర అసహనం కలగడం

చేతులు కాళ్లు చల్లబడి పోతుండటం వంటివి గుండెపోటు వచ్చే ముందు చిహ్నాలుగా చెప్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu