రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో ఓ విషాదకర ఘటన వెలుగు చూసింది. వాహనం పార్కింగ్ గొడవ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. వాహనం పార్కింగ్ విషయంలో రెండు కుటుంబాల మధ్య చెలరేగిన గొడవ కారణంగా ఓ వ్యక్తి గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు.
జైపూర్ నగరానికి చెందిన విజయేంద్ర సింగ్ అనే వ్యక్తి కుటుంబం తమ వాహనాన్ని ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. పొరుగింటి వ్యక్తి కూడా తన ట్రాలెవర్‌ను ఇరుకైన సందులో పార్కింగ్ చేశాడు. దీన్ని తీసేందుకు ప్రయత్నం చేశాడు. దీనికి విజయేంద్ర సింగ్ కుటుంబం అభ్యంతరం చెప్పింది.
దీంతో ఇరు వర్గాల మధ్య చిన్నపాటి వాగ్వాదం మొదలై ఇరు వర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. ఈ గొడవను ఆపే క్రమంలో ఓ వ్యక్తి గుండెపోటు రావడంతో విజయేంద్ర సింగ్ అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. క్షణాల వ్యవధిలో విజయేంద్ర సింగ్ చనిపోవాడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. మృతుడు మాజీ బ్యాంకు ఉద్యోగిగా గుర్తించారు.

