Dailyhunt
కారును ఎత్తెత్తి పడేసిన ఏనుగు, ఒకరు మృతి, వీడియో

కారును ఎత్తెత్తి పడేసిన ఏనుగు, ఒకరు మృతి, వీడియో

కేరళం రాష్ట్రంలోని కిడంగూర్ మహావిష్ణు ఆలయం సమీపంలో ఘోరం జరిగింది. ఆలయంలో ఉత్సవాలు జరుగుతుండగా ప్రాంగణంలో వున్న ఏనుగు ఒక్కసారిగా అదుపుతప్పింది.
సమీపంలో వున్న ప్రజలపైకి దూసుకొచ్చింది. వారంతా తప్పించుకోవడంతో పక్కనే వున్న స్కూటర్లను తొండంతో ఎత్తి విసిరేసింది. అక్కడే వున్న కారును సైతం ఎత్తెత్తి కింద పడేసింది.

ఏనుగు చేసిన ఈ బీభత్సంలో ఒక వ్యక్తి చనిపోయాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఏనుగును అదుపులోకి తెచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించిన మీదట అది మిన్నకున్నది. కాగా ఉత్సవాలకు జంతువులను ఉపయోగించవద్దని ఇప్పటికే జంతు ప్రేమికులు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu