Dailyhunt
కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను పాకిస్తాన్ భూభాగంలో చూపిన నేపాల్ ఎయిర్‌లైన్స్, క్షమాపణ

కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను పాకిస్తాన్ భూభాగంలో చూపిన నేపాల్ ఎయిర్‌లైన్స్, క్షమాపణ

నేపాల్ ఎయిర్ లైన్స్ భారతదేశానికి క్షమాపణలు చెప్పింది. జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను పొరబాటున పాకిస్తాన్ భూభాగంలో చూపామనీ, అందుకు క్షమించాలని కోరింది.
ఐతే క్షమాపణలు చెప్పడానికి కూడా టైం తీసుకున్నది. అసలు ఏం జరిగిందంటే...

జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను పాక్ భూభాగంలో వున్నట్లు నేపాల్ ఎయిర్ లైన్స్ తన మ్యాపులో చూపించింది. ఈ మ్యాపును చూసిన భోజ్ పురి నటుడు, గాయకుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇది రెచ్చగొట్టేది వుందంటూ ట్వీట్ చేసారు. దీనితో నేపాల్ ఎయిర్ లైన్స్ ఆ మ్యాప్ తో వున్న పోస్టును డిలీట్ చేసింది. భారత విదేశాంగ శాఖ, విమానయాన మంత్రిత్వశాఖ నేపాల్ పైన దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు కోరారు. ఈ నేపధ్యంలో అంతర్జాతీయ సరహద్దులకు సంబంధించి తప్పులు జరిగాయని అంగీకరిస్తూ భారతదేశానికి నేపాల్ క్షమాపణలు చెప్పింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu