Sheelu Balhara
అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు శీలు బల్హారా భార్య ముస్కాన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముస్కాన్ ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.ఆమె బలవన్మరణానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఫర్మానా బాద్‌షాహ్‌పూర్‌కు చెందిన ముస్కాన్ తండ్రి సుఖ్‌బీర్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో, రెండేళ్లన్నర క్రితం జరిగిన వివాహం నాటి నుంచే కట్నం కోసం అత్తమామలు తన కుమార్తెను వేధిస్తున్నారని ఆరోపించారు. అలాగే, షీలు వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని కూడా ఆయన ఆరోపించారు.

