తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కె.కవిత తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఇపుడు ఆ పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం మార్పు చేసింది.
తెలంగాణ రాష్ట్ర సేన కాకుండా తెలంగాణ రక్షణ సేన (తెరాస) అనే పేరును ఖరారు చేస్తూ ఆ పార్టీకి గుర్తింపునిచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి వెళఅలి అధికారిక లేఖను అందజేశారు.
ఈ నెల 25వ తేదీన మేడ్చల్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో కవిత తన కొత్త పార్టీ పేరును ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ సభలో తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. అయితే, ఇపుడు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రక్షణ సేనగా మార్చింది.
ఈ పేరును కవితకు కేటాయించిన విషయాన్ని ధృవీరకిస్తూ ఎన్నికల సంఘం పంపిన లేఖతో, ఆమె పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఓ కీలక ఘట్టం పూర్తయింది. ఈ అధికారిక ఆమోదంతో కవిత తన రాజకీయ కార్యకాలాపాలను తెలంగాణ రక్షణ సేన పేరుతో ముందుకు తీసుకెళ్లనున్నారు.

