Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మగవాడికి కమిట్‌మెంట్ ఇవ్వనిదే సినిమా ఛాన్సే కాదు సీరియల్ ఛాన్స్ కూడా రాదు, యువతి వీడియో వైరల్

మగవాడికి కమిట్‌మెంట్ ఇవ్వనిదే సినిమా ఛాన్సే కాదు సీరియల్ ఛాన్స్ కూడా రాదు, యువతి వీడియో వైరల్

సోషల్ మీడియాలో కేస్టింగ్ కౌచ్ గురించి ఓ యువతి షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆమె సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ... నేనేదో సోషల్ మీడియాలో వీడియోలు పెడుతుంటాను.
ఆ వీడియోలు చూసి సినిమా ఆఫర్ వుందని ఓ సినిమా కంపెనీవాళ్లు పిలిచారు. వాళ్లతో డిస్కషన్స్ అంతా అయ్యాక చివరికి వాళ్లు చెప్పిందేమిటంటే... కమిట్మెంట్ కావాలని. దాంతో ఆ అవకాశం వద్దని తిరిగి వచ్చేసాను.

రెండోసారి ఇంకొకరు సీరియల్లో అవకాశం వుందని పిలిచారు. ఒకసారి అనుభవించినా బుద్ధి లేని నేను నమ్మి మళ్లీ వెళ్లాను. అక్కడే అదే తంతు. సీరియల్లో నటించడానికి కూడా కమిట్మెంట్ ఇవ్వాలని అడిగారు. మళ్లీ తిరిగి వచ్చేసాను. ఆ తర్వాత ఒకరు ఫోక్ సాంగ్ అవకాశం వుంది చేస్తావా అంటే మళ్లీ వచ్చాను. రెండుమూడు గంటలు కూర్చోబెట్టి అంతా మాట్లాడాక మళ్లీ వాడు కూడా కమిట్మెంట్ అడిగాడు.

అందుకే నేను చెప్తున్నా. ఈ సినిమా ఇండస్ట్రీలో ఆడది పైకి రావాలంటే ఖచ్చితంగా కమిట్ అవ్వాల్సిందే. అది లేకుండా సినిమాల్లో పైకి వచ్చామని చెబితే అది అబద్ధమే. నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి. నేను చెప్పేది నిజం. ఎవరూ కూడా అవకాశం ఇస్తామంటే అమాయకంగా మాత్రం రావద్దు అంటూ సూచనలు చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu