Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మరో మూడేళ్ల తర్వాత ఒక్క ఉద్యోగి ఉండరు... : గూగుల్ మాజీ బిజినెస్ చీఫ్

మరో మూడేళ్ల తర్వాత ఒక్క ఉద్యోగి ఉండరు... : గూగుల్ మాజీ బిజినెస్ చీఫ్

రో మూడేళ్ల తర్వాత ఒక్క ఉద్యోగి కూడా ఉండరని గూగులు మాజీ బిజినెస్ చీఫ్ మొ గావ్‌డాట్ హెచ్చరించాడు. ఆయన ది డైరీ ఆఫ్ ఏ సీఈవో పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక అంశాలను వెల్లడించారు.
రోజురోజుకూ కృత్రిమ మేధ అన్ని రంగాల్లోకి, ప్రజల జీవితంలోకి వేగంగా విస్తరిస్తోందన్నారు.

చాట్‌జీపీటీ, క్లాడ్‌, జెమినై, గ్రోక్ వంటి ఏఐ టూల్స్ మెయిల్స్ రాయడం, డాక్యుమెంట్లను విశ్లేషించడం వంటి పనుల్లో సహాయం చేస్తున్నాయి. అయితే ఆ టూల్స్ భవిష్యత్తులో ఎలా రూపుదిద్దుకుంటాయనే దానికి ఇదంతా ఒక ఆరంభం మాత్రమేని గూగుల్ ఎక్స్‌లో చీఫ్‌ బిజినెస్ ఆఫీసర్‌గా పనిచేసిన మొ గావ్‌డాట్ హెచ్చరించారు.

ఈ టెక్నాలజీ పరిశ్రమలను తలకిందులు చేస్తుందని, లక్షలాది ఉద్యోగాలను తొలగిస్తుందని, ఈ సమాజాన్ని పునర్నిర్మిస్తుందన్నారు. అంతలా ఏఐ శక్తిమంతం కావడానికి మానవాళికి మూడేళ్లు మాత్రమే సమయం ఉందని వ్యాఖ్యలు చేశారు. ది డైరీ ఆఫ్ ఏ సీఈఓ పాడ్‌కాస్ట్‌లో ఈమేరకు హెచ్చరికలు చేశారు.

'ఏఐ దానంతట అదే ఈ ప్రమాదాలను సృష్టించదు. దానిని కంపెనీలు, ప్రభుత్వాలు ఎలా వాడతాయన్నదే ఇక్కడ కీలకం. చాట్‌బాట్‌, వీడియోలతో ఏఐ ఇప్పటికే ప్రజల జీవితంలో భాగమైంది. కానీ ప్రయోగశాలల లోపల జరుగుతున్నది అంతకంటే చాలా ముఖ్యమైంది. సిస్టమ్‌లు సొంతంగా కోడ్‌ను మెరుగుపర్చుకుంటున్నాయి.

మార్పులను పరీక్షిస్తున్నాయి. ఎప్పటికప్పుడు మెరుగైన వెర్షన్లను వేగంగా విడుదల చేయడం వంటి పనులు చేస్తున్నాయి. ప్రజల అవగాహనకు, వాస్తవ సామర్థ్యానికి ఉన్న అంతరమే.. రాబోతున్న మార్పు ఏ స్థాయిలో ఉందో చాలామంది గ్రహించలేకపోవడానికి కారణం' అని గావ్‌డాట్ అభిప్రాయపడ్డారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu