బాలీవుడ నటుడు అమీర్ ఖాన్ మరోమారు వివాహం చేసుకున్నారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న అమీర్ ఖాన్ ఇపుడు ముచ్చటగా మూడోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
ముంబై నగరంలోని బాంద్రాలో ఆమిర్ నివాసంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ సందర్భంగా పత్రాలపై సంతకాలు చేయడం ద్వారా వారిద్దరూ దాంపత్య బంధంలోకి అడుగుపెట్టారు. గతంలో రెండు సార్లు పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న ఆమిర్.. గౌరీతో రెండేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. అమీర్‌కు ఆమెతో 25 ఏళ్లకు పైగా స్నేహముంది.
మరోవైపు గౌరీకి కూడా గతంలో వివాహమైంది. ఆ తర్వాత ఆమె విడాకులు తీసుకున్నారు. అమీర్ కుమారులు జునైద్ ఖాన్, ఆజాద్ రావ్ ఖాన్, కుమార్తె ఇరా ఖాన్‌తోపాటు గౌరీ స్ప్రాట్ తనయుడి సమక్షంలో వివాహ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమిర్ టీం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఈ వేడుకకు రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీతో సహా పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు హాజరుకావడం గమనార్హం.

