Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీ ఉదయానికి శక్తినివ్వండి: మీ అల్పాహారంలో కాలిఫోర్నియా బాదం ఎందుకు ఉండాలంటే?

మీ ఉదయానికి శక్తినివ్వండి: మీ అల్పాహారంలో కాలిఫోర్నియా బాదం ఎందుకు ఉండాలంటే?

వినియోగదారులు ఆరోగ్యకరమైన జీవనశైలికి అంతకంతకూ అధిక ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో, దీర్ఘకాలిక శ్రేయస్సుకు మద్దతుగా సరళమైన మరియు స్థిరమైన అలవాట్లను పెంపొందించుకోవడం చాలా ముఖ్యం.
సమతుల్యమైన అల్పాహారంతో రోజును ప్రారంభించడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు తగ్గకుండా ఉంటాయి. అలాగే రోజంతా సరైన ఆహారాన్ని ఎంచుకోవడానికి ఇది సహాయపడుతుంది. కానీ, బిజీ షెడ్యూల్‌లు, ఉరుకుల పరుగుల ఉదయం వేళల్లో తరచుగా అల్పాహారం మానేయడం లేదా సమతుల్య పోషణ లేని సులభమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం జరుగుతుంటుంది. అయితే, దైనందిన జీవితంలో పెద్దగా మార్పులు చేయకుండానే.. ఉదయం పూట పాటించే చిన్న, ఆచరణాత్మకమైన అలవాట్లు ప్రజలు క్రమం తప్పకుండా మెరుగైన ఆహారం తీసుకునేలా సహాయపడతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

అల్పాహారాన్ని మరింత పోషకభరితంగా మార్చుకోవడానికి కాలిఫోర్నియా బాదం వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవడం ఒక సులభమైన మార్గమని నిపుణులు అంగీకరిస్తున్నారు. సహజంగా బహుళ ప్రయోజనాలు ఉండే, ఎంతో అనుకూలమైన కాలిఫోర్నియా బాదంలో.. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు పదార్థం, మెగ్నీషియం, మరియు విటమిన్ 'ఇ' తో సహా 24 రకాల పోషకాలు నిండి ఉంటాయి. అందువల్ల సమతుల్య అల్పాహారంలో వీటిని సులభంగా చేర్చుకోవచ్చు.

అంతేకాకుండా, జీర్ణకోశ బ్యాక్టీరియా వైవిధ్యానికి తోడ్పడే పాలీఫెనాల్స్ కూడా వీటిలో ఉంటాయి. ఇందులోని విటమిన్ ఇ, జింక్, ఐరన్ మరియు కాపర్ వంటి పోషకాలు రోగనిరోధక వ్యవస్థ పనితీరుతో ముడిపడి ఉంటాయి. వీటిలోని ప్రోటీన్, ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వుల కలయిక ఆహారం కడుపులోంచి పేగుల్లోకి వెళ్లే ప్రక్రియను నెమ్మదింపజేసి, కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా వీటిని తీసుకున్నప్పుడు, ప్రజలు ఎక్కువ సమయం పాటు ఆకలి లేకుండా ఉండటానికి మరియు బరువు నియంత్రణకు ఇవి సహాయపడతాయి.

ఉదయం నిద్రలేవగానే శరీరానికి పోషణ అందించాల్సిన ఆవశ్యకత గురించి మ్యాక్స్ హెల్త్‌కేర్ డయటెటిక్స్ రీజినల్ హెడ్ రితికా సమద్దర్ మాట్లాడుతూ.. "రాబోయే గంటల కొద్దీ సమయానికి అవసరమైన పోషకాహార పునాదిని వేయడంలో రోజులోని అల్పాహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయినప్పటికీ, బిజీగా ఉండే ఉదయపు వేళల్లో తరచుగా ప్రజలు అల్పాహారం మానేయడానికో లేదా కేవలం తమకు సులభంగా దొరికే ఆహారాన్ని ఎంచుకోవడానికో మొగ్గుచూపుతారు. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం అనేది సంక్లిష్టంగా ఉండాల్సిన అవసరం లేదు. సంపూర్ణమైన, పోషక విలువలు అధికంగా ఉండే ఆహారాలతో కూడిన సమతుల్య అల్పాహారం.. మొత్తం ఆరోగ్యాన్ని, మరియు స్థిరమైన శక్తి స్థాయిలను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. కాలక్రమేణా, ఆలోచనాత్మకంగా చేసే ఈ చిన్న చిన్న ఎంపికలు ఆరోగ్యకరమైన జీవనశైలికి ఎంతగానో దోహదపడతాయి" అని అన్నారు.

న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి తన అభిప్రాయాలను పంచుకుంటూ.. "ఆరోగ్యకరమైన ఆహారం అంటే కఠినమైన డైట్‌లను అనుసరించడం లేదా జీవనశైలిలో భారీ మార్పులు చేయడం కాదు. క్రమం తప్పకుండా పాటించడానికి వీలయ్యే ఆచరణాత్మకమైన అలవాట్లను అలవర్చుకోవడం. శరీరానికి అవసరమైన పోషణను అందించడంతో పాటు మొత్తం శ్రేయస్సుకు తోడ్పడే పోషక విలువలున్న ఆహారాన్ని చేర్చుకోవడానికి సమతుల్య అల్పాహారం ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది" అని పేర్కొన్నారు.

బిజీ జీవనశైలి ఉన్నప్పటికీ పోషకాహారానికి తానెలా ప్రాధాన్యత ఇస్తారనే దాని గురించి నటి సోహా అలీ ఖాన్ మాట్లాడుతూ.. "నాకు ఏ రెండు ఉదయాలు ఒకేలా ఉండవు. కానీ నా దినచర్యను సరళంగా ఉంచుకోవడం వల్ల దానిని క్రమం తప్పకుండా పాటించడం చాలా సులభం అని నేను తెలుసుకున్నాను. నేను నా రోజును సంపూర్ణమైన ఆహారాలతో ప్రారంభించడానికి ప్రయత్నిస్తాను. అది నాకు శక్తినిచ్చి, ఆ తర్వాత వచ్చే ప్రతి పనికీ నన్ను సిద్ధం చేస్తుంది. కాలిఫోర్నియా బాదం నా అల్పాహారంలో క్రమం తప్పని భాగంగా మారిపోయింది, ఎందుకంటే వీటిని సులభంగా తీసుకువెళ్లవచ్చు, ఎంతో అనుకూలమైనవి మరియు సహజంగానే పోషకాలు అధికంగా ఉండేవి. నేను ఇంట్లో ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా, నా దినచర్యలో సులభంగా కలిసిపోయే చిన్న అదనపు ఆహారం ఇది. పరిపూర్ణత కోసం పాకులాడటం కంటే, ప్రతిరోజూ మనం ఎంచుకునే చిన్న చిన్న ఎంపికల నుండే శాశ్వతమైన ఆరోగ్యం లభిస్తుందని నేను గట్టిగా నమ్ముతాను" అని అన్నారు.

ఆరోగ్యం మరియు పోషకాహారం పట్ల పెరుగుతున్న అవగాహనతో, వాస్తవికమైన మరియు సుదీర్ఘకాలం పాటించగలిగే అలవాట్లపై దృష్టి సారించాలని నిపుణులు వినియోగదారులను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. కాలిఫోర్నియా బాదం వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని అల్పాహారంలో చేర్చుకోవడం అనేది ఆధునిక జీవనశైలిలో సులభంగా ఇమిడిపోయే ఒక చిన్న అలవాటు. ఇది మొత్తం ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

కాలిఫోర్నియా బాదంపప్పులు సహజమైన, సంపూర్ణమైన మరియు నాణ్యమైన ఆహారం. కాలిఫోర్నియాలోని 7,600 మందికి పైగా బాదం పెంపకందారులు మరియు ప్రాసెసర్ల తరఫున మార్కెటింగ్, వ్యవసాయం మరియు ఉత్పత్తికి సంబంధించిన అన్ని అంశాలలో పరిశోధన-ఆధారిత విధానం ద్వారా కాలిఫోర్నియా బాదంపప్పులను 'ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా' ప్రోత్సహిస్తుంది. వీరిలో చాలా మందికి ఇవి తరతరాలుగా వస్తున్న కుటుంబ వ్యవసాయ కార్యకలాపాలు. 1950లో స్థాపించబడి, కాలిఫోర్నియాలోని మోడెస్టో కేంద్రంగా పనిచేస్తున్న ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా అనేది ఒక లాభాపేక్షలేని సంస్థ. ఇది యునైటెడ్ స్టేట్స్ వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో పెంపకందారులచే చట్టబద్ధం చేయబడిన ఫెడరల్ మార్కెటింగ్ ఆర్డర్‌ను నిర్వహిస్తుంది.

ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా లేదా బాదంపప్పుల గురించి మరింత సమాచారం కోసం, almonds.inని సందర్శించండి లేదా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మరియు యూట్యూబ్‌లో కాలిఫోర్నియా బాదంను అనుసరించండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu