మీనం : ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు చేపట్టే ఆస్కారం వుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. అనుకోని ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు వాయిదాపడుట మంచిది. మీ సంతానం ఉన్నత విద్యల గురించి అవిశ్రాంతంగా శ్రమిస్తారు.