Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మిస్టరీ, సస్పెన్స్ తో వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ  టీజర్

మిస్టరీ, సస్పెన్స్ తో వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ టీజర్

View: The Point of View' team

హేష్ కాంపెల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ' చిత్ర టీజర్‌ను చిత్రబృందం నేడు ఘనంగా విడుదల చేసింది.
మిస్టరీ, సస్పెన్స్, ఎమోషనల్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కార్తికేయ సమర్పణలో పరవాణి చలనచిత్ర బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం విభిన్నమైన కథనంతో తెరకెక్కుతోంది. "ది పాయింట్ ఆఫ్ వ్యూ" అనే ట్యాగ్‌లైన్‌నే కథలోని ప్రధాన అంశాన్ని ప్రతిబింబిస్తోంది. టీజర్ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ఘనంగా మీడియా సమావేశాన్ని నిర్వహించింది.

ఈ సందర్భంగా నిర్మాత సత్య చౌదరి మాట్లాడుతూ, దాదాపు పదేళ్ల క్రితం మహేష్ ఈ కథను నాకు వినిపించారు. ఒక మహిళా ప్రధాన కథతో మంచి సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించాను. నా తొలి నిర్మాణంతో ఇద్దరు తెలుగు హీరోయిన్లను పరిచయం చేయడం ఆనందంగా ఉంది అన్నారు.

హీరోయిన్ లు సోనియా నాయుడు, పూజా రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. మా టీజర్‌ను ఆదరించినట్లే సినిమా విడుదలైన తర్వాత కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను" అన్నారు.

దర్శకుడు మహేష్ కాంపెల్లి మాట్లాడుతూ, ఏ దర్శకుడి దగ్గరా పని చేయలేదని, అయినప్పటికీ నేను రాసుకున్న కథపై పూర్తి నమ్మకం ఉంది. దిశ ఘటనతో పాటు కొన్ని వాస్తవ సంఘటనల నుంచి ప్రేరణ పొందిన ఈ కథ ద్వారా మహిళల పట్ల సమాజంలో అవగాహన పెంచే బలమైన సందేశాన్ని ఇవ్వాలనుకున్నాను. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అన్నారు.

సంగీత దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో మంగ్లీ, హారిణి అద్భుతమైన పాటలు పాడారు. మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను" అన్నారు.

ఇంకా సమీర్, అన్విధ్, సాగర్, రంగారావు చౌదరి, మూసా అలీ ఖాన్, దర్శకుడు సాయి తదితరులు మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu