మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కైలారస్ ప్రాంతంలో ఓ ఉపాధ్యాయురాలికి గుండె పోటు వచ్చిందేమోనని సీపీఆర్ చేయడంతో ఆమె రెండు పక్కటెముకలు విరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్‌లోని కైలారస్‌లో లలిత అనే ఉపాధ్యాయురాలు రోడ్డుపై వెళ్తోంది. ఐతే తీవ్రమైన ఎండ కారణంగా తన స్కూటర్ పైనుంచి ఆమె కింద పడిపోయారు. అక్కడే ఉన్న ఇద్దరు యువకులు ఆమెకు గుండెపోటు వచ్చిందని భావించి, ఆమెకు నిరంతరాయంగా సీపీఆర్ చేయడం ప్రారంభించారు.
ఆసుపత్రిలో పరీక్షించిన తర్వాత, ఆమెకు గుండెపోటు రాలేదని, కానీ సరిగ్గా సీపీఆర్ చేయకపోవడం వల్ల ఆమె పక్కటెముకలు రెండు విరిగాయని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె అలా పడిపోతే ఆమెకి గుండెపోటు వచ్చిందో రాలేదో ఎవరికి తెలుసు. ఐతే యువకులు ఆ పని చేయడం సమజసమైనదే. ఎముకలు విరిగితే అతికించవచ్చు కానీ ఒకవేళ అది గుండెపోటు అయితే ప్రాణం తిరిగి రాదు కదా అంటున్నారు.

