Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

నెల్లూరు: సమాజ సంక్షేమం , గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో కార్యకలాపాలను నిర్వహిస్తోన్న 1000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ అయిన వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్, లింగవరం, వరగల్లి అనే రెండు గ్రామాలలో 1,000 మందికి పైగా నివాసితులకు ప్రయోజనం చేకూర్చేలా రివర్స్ ఆస్మోసిస్(ఆర్‌ఓ) తాగునీటి ప్లాంట్లను పునరుద్ధరించి, ఆధునీకరించింది.

పునరుద్ధరించిన సదుపాయాలతో ఈ రెండు గ్రామాలలో ఉన్న ప్రతి ఆర్‌ఓ ప్లాంట్ ద్వారా దాదాపు 100 కుటుంబాలకు సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీటిని అందించటం సాధ్యమవుతుంది. తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్)లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం, సమాజంలోని ఒక కీలక అవసరాన్ని తీరుస్తుంది. ఎందుకంటే, ఈ రెండు ప్లాంట్లూ ఏడాదికి పైగా పనిచేయకపోవడంతో ఈ ప్రాంత వాసుల తాగునీటి లభ్యతపై తీవ్ర ప్రభావం పడింది.

మీనాక్షి ఎనర్జీ జోక్యం చేసుకోక ముందు, గ్రామస్థులు తమ రోజువారీ అవసరాల కోసం దూరంగా, అస్థిరంగా ఉండే నీటి వనరులపై ఆధారపడవలసి వచ్చేది. దీనివల్ల, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించి, ప్లాంట్ల పనితీరును పునరుద్ధరించడానికి, వాటి దీర్ఘకాలిక విశ్వసనీయతను మెరుగుపరచడానికి కంపెనీ విస్తృతస్థాయిలో పునరుద్ధరణ పనులను చేపట్టింది.

ఈ పునరుద్ధరణ ప్రయత్నాలలో భాగంగా కార్యాచరణ సామర్థ్యం, విశ్వసనీయత, నీటి నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఫిల్టర్లు, మెంబ్రేన్లు, పంపుల మార్పిడితో పాటు కీలకమైన సివిల్ మరమ్మతులు, ఆటోమేటెడ్ వ్యవస్థల ఏర్పాటుతో సహా ఆర్ఓ ప్లాంట్లను మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ పునరుద్ధరించింది. ఈ నవీకరణల అనంతరం, ప్రజల వినియోగార్ధం ఈ సదుపాయాలను సంబంధిత పంచాయతీ పరిపాలనా యంత్రాంగాలకు అప్పగించారు.

ఈ కార్యక్రమం గురించి వేదాంత పవర్ సీఈఓ రాజిందర్ సింగ్ అహుజా మాట్లాడుతూ, సమాజ శ్రేయస్సుకు సురక్షితమైన తాగునీటి లభ్యత అత్యంత కీలకం. ఈ తరహా కార్యక్రమాల ద్వారా మేము కార్యకలాపాలు సాగించే ప్రాంతాల్లో కీలకమైన గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. నీరు, ఆరోగ్యం, విద్య, సమాజ అభివృద్ధి వంటి రంగాలలో అర్థవంతమైన, స్థిరమైన సీఎస్ఆర్ కార్యక్రమాలను చేపట్టడానికి మేము కట్టుబడి ఉన్నాము అని అన్నారు.

రెండు గ్రామాల పంచాయతీ ప్రతినిధులు మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ సకాలంలో చేపట్టిన ఈ చర్యను ప్రశంసించారు. పునరుద్ధరించిన ఈ సౌకర్యాలు, ముఖ్యంగా సురక్షితమైన, నమ్మకమైన తాగునీటిని పొందడంలో నివాసితులు ఎదుర్కొంటున్న రోజువారీ సవాళ్లను గణనీయంగా తగ్గిస్తాయని వారు పేర్కొన్నారు. దీర్ఘకాలిక సామాజిక ప్రయోజనం కోసం ప్లాంట్ల నిర్వహణ, నిరంతరాయ కార్యకలాపాలను నిర్ధారించడానికి పంచాయతీ యంత్రాంగాలు కూడా కృషి చేస్తామంటూ వెల్లడించాయి.

పునరుద్ధరించిన ఆర్‌ఓ సౌకర్యాలను ప్రారంభించిన మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ యాక్టింగ్ సీఈఓ కె. బినూ రాఫెల్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన, మరింత పటిష్టమైన సమాజాలను నిర్మించడమే లక్ష్యంగా సమ్మిళిత, సుస్థిరమైన సామాజిక కార్యక్రమాల ద్వారా నీటి లభ్యతను, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిని పెంపొందించడంపై తమ కంపెనీ దృష్టి సారించిందని తెలిపారు. తాము కార్యకలాపాలు సాగించే ప్రాంతాల్లో అవసరాల ఆధారిత, సుస్థిరమైన చర్యల ద్వారా కీలకమైన సామాజిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, జీవన నాణ్యతను మెరుగుపరచడంపై మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ నిరంతరం దృష్టి సారిస్తోంది

ఈ ప్రయత్నాలలో భాగంగా, కంపెనీ ఇటీవల తమ్మినపట్నం, మోమిడి, లింగవరం మరియు వరగల్లి గ్రామాలలో 35 సోలార్ వీధి దీపాలను ఏర్పాటు చేసింది. దీనివల్ల రాత్రిపూట దృశ్యమానత, ప్రజా భద్రత మెరుగుపడి 2,000 మందికి పైగా నివాసితులకు ప్రయోజనం చేకూరింది. ఈ కార్యక్రమం బలహీన గిరిజన కుటుంబాలతో సహా కీలక రహదారులు, ఉమ్మడి ప్రాంతాలు, లోతట్టు నివాస ప్రాంతాలలో రాకపోకలను మెరుగుపరచడంతో పాటు, స్వచ్ఛ ఇంధన పరిష్కారాల ద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాలను కూడా బలోపేతం చేసింది.

ఇలాంటి సమాజ కేంద్రీకృత కార్యక్రమాల ద్వారా, వేదాంత పవర్ యొక్క మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ క్షేత్రస్థాయిలో దీర్ఘకాలిక, సమ్మిళిత , సుస్థిర అభివృద్ధిని ముందుకు నడిపిస్తూనే ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu