Dailyhunt
నిమ్మ ధరలకు రెక్కలొచ్చాయి.. రూ.10వేలతో ఆల్ టైమ్ రికార్డ్

నిమ్మ ధరలకు రెక్కలొచ్చాయి.. రూ.10వేలతో ఆల్ టైమ్ రికార్డ్

నిమ్మ ధరలకు రెక్కలొచ్చాయి. కిలో నిమ్మకాయలు ప్రస్తుతం రూ.125 వరకు పలుకుతోంది. ఏపీలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పొదలకూరు నిమ్మ మార్కెట్లో 80 కిలోల నిమ్మ బస్తా ఏకంగా రూ.10వేలు పలికి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.

గత పదేళ్లలో ఇంత ధరలు పలకలేదని.. వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్చి రెండో వారం వరకు గిట్టుబాటు ధర కూడా లేని నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోయారు.

జనవరిలో కనీస మద్దతు ధర కూడా లభించకపోవడంతో.. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిమ్మను రూ.8చొప్పున కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. అయితే ప్రస్తుతం నిమ్మకు భారీ డిమాండ్ ఏర్పడింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu