Dailyhunt
నీట్  యూజీ 2026కు సర్వం సిద్ధం... మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష

నీట్ యూజీ 2026కు సర్వం సిద్ధం... మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష

దేశంలోని వైద్య విద్యలో ప్రవేశం కోసం ఆదివారం దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న నీట్ యూజీ 2026కు సర్వం సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరుగనుంది.
ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 22,79,743 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరవుతున్నారు. పెన్ అండ్ పేపర్ విధానంలో జరిగే ఈ పరీక్షకు 13,32,928 మంది విద్యార్థినిలు, 9,46,815 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

కాగా, ఈ పరీక్ష ప్రశాంతంగా జరిగేలా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించనున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు అంతకన్నా ఎక్కువ మంది గుడికూడరాదని ఆదేశాలు జారీచేశారు.

నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నిబంధనలన్నీ పక్కాగా పాటించాలని తెలంగాణ రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ నరేంద్ర కుమార్ తెలిపారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థుులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని తెలిపారు. అలాగే, ఫుల్ స్లీవ్డ్ షర్ట్స్ ధరించడం నిషేధమని వెల్లడించారు.

పెద్ద బటన్లు, పెద్ద జిప్‌లు, ఎంబ్రాయిడరీ దుస్తులు ధరించరాదు. బూట్లు ధరించేందుకు అనుమతి లేదు. స్పిప్పర్లు, శాండిళల్స్, లో హీల్ పాదరక్షలు వేసుకోవాలి. మతపరమైన దుస్తులు ధరించేవారు మాత్రం మధ్యాహ్నం 12.30 గంటల లోపు పరీక్షా కేంద్రానికి చేరుకుని, తనిఖీ ప్రక్రియను పూర్తి చేసుకుని పరీక్షా కేంద్రంలోకి వెళ్లాలని సూచించారు. పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానికి, మెటాలిక్ వస్తువులు, ఆభరణాలు నిషేధమని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu