Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NTR: ​విజయ్ గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంతో పోల్చిన నందమూరి రామకృష్ణ

NTR: ​విజయ్ గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంతో పోల్చిన నందమూరి రామకృష్ణ

Regan to Dalapati Vijay

వీర భ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పింది చెప్పినట్లుగా ఊహించినట్లుగా ప్రపంచ సినీ-రాజకీయ చరిత్రలో మరో ఒక అద్భుతమైన పునరావృతం అయిందని దివంగత ఎన్.టి.ఆర్.
తనయుడు నందమూరి రామకృష్ణ పేర్కొంటూ న్యూస్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రీగన్, ఎం.జి.ఆర్, జయలలిత, ఎన్.టి.ఆర్. పొటోలను పోస్ట్ చేసి మీ శ్రేయోభిలాషి అంటూ విజయ్ నుద్దేశించి రాశారు.

వెండితెర నుండి జనం గుండెల్లోకి ప్రవేశించి, అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ఎదిగిన రోనాల్డ్ రీగన్ గారు ఒక చరిత్ర అయితే...​దక్షిణ భారత రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన భారతరత్న ఎమ్.జి.ఆర్ గారు, పురట్చి తలైవి జయలలిత గారు మరో అద్భుతం!


అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ, తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి, కేవలం 9 నెలల్లోనే ప్రభంజనం సృష్టించి అధికారాన్ని చేపట్టి పెదపాలిట పెన్నిధిగా, రైతన్నలకు అన్నదాతగా, కార్మికసోదరలకు దన్నుగా, ఆడపడుచులకు అన్నగా నిలబడిన మన అన్నగారు, నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఒక యుగపురుషుడు.

నేడు అదే స్ఫూర్తితో ఒక రాజకీయ పార్టీ స్థాపించి 27 నెలల కాలంలోనే అఖండ విజయాన్ని అందుకుని, పీఠాన్ని అధిరోహించబోతున్న సినీ-రాజకీయ ధురంధరుడు మన విజయ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాభినందనలు!

చరిత్రను తిరగరాస్తూ మీరు సాధించిన ఈ విజయం అద్వితీయం. మీరు మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని, ప్రజా సేవలో సుదీర్ఘకాలం వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.. మీ శ్రేయోభిలాషి ​- నందమూరి రామకృష్ణ తెలియజేశారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu