
ప్రతిష్ఠాత్మక సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ (సీఎస్‌ఎస్) పరీక్షలో విజయం సాధించిన సనా రామ్‌చంద్… పాకిస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (పీఏఎస్)కు ఎంపికయ్యారు.
పాక్‌లో హిందువులు ఎక్కువగా ఉండే సింధ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతానికి చెందిన సనా ఎంబీబీఎస్ పూర్తిచేసి డాక్టర్‌గా పనిచేస్తున్నారు. సివిల్ సర్వీసెస్‌పై ఆసక్తితో సీఎస్‌ఎస్ పరీక్ష రాశారు.