Dailyhunt
పదో తరగతి పరీక్షల్లో ఒకేసారి పాసయిన తల్లీకొడుకులు

పదో తరగతి పరీక్షల్లో ఒకేసారి పాసయిన తల్లీకొడుకులు

దో తరగతి పరీక్షల్లో ఒకేసారి ఆ తల్లీకొడుకులు ఉత్తీర్ణులయ్యారు. దీనితో ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లికి చెందిన బండారు లక్ష్మీ లహరి అనే మహిళ కొన్ని కారణాల వల్ల పదో తరగతి పరీక్షలు రాయలేకపోయింది.
వ్యక్తిగత కారణాల వల్ల ఆరో తరగతిలోనే చదువు ఆపేసింది.

ఐతే తన కుమారుడు పదో తరగతి చదువుతుండగా అతడితో పాటు ఓపెన్ స్కూలు ద్వారా ఆమె కూడా టెన్త్ చదివింది. రిజల్ట్స్ రావడంతో ఎంతో ఉత్కంఠగా తను పాసయ్యానా లేదా అని ఎదురుచూసింది. కుమారుడికి 600కి 562 మార్కులు రాగా తల్లి లహరికి 360 వచ్చాయి. ఆమె ఉత్తీర్ణురాలైందని తెలిసి ఆమె ఇద్దరు కొడుకులు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu