గత నెలలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్రాథమిక వైద్య పరీక్షల తర్వాత ఆయనను హైదరాబాద్ నగరానికి తరలించారు. అక్కడ వివిధ రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ముక్కుకు చిన్నపాటి సర్జరీ చేయాల్సివుంటుందని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో తన ముక్కుకు సర్జరీ చేయించుకున్నారు. ఆపరేషన్ తర్వాత పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో, పవన్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలోని తన నివాసానికే పరిమితమయ్యారు.
అలాగే, ఇటీవల కన్నుమూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రీజెన్సీ సెరామిక్స్ అధినేత జీఎన్ నాయుడు కుటుంబాన్ని కూడా చంద్రబాబు పరామర్శించనున్నారు. నందగిరి హిల్స్‌లోని నివాసానికి వెల్లి కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేయనున్నారు.

