Thefts
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కల్పిచడంతో పాటు దోపిడీలు, చోరీలను అరికట్టాల్సిన పోలీసే దొంగగా మారిపోయాడు. పోలీస్ కదా అని లిఫ్ట్ ఇస్తే ఏకంగా రూ.20 వేలు కాజేశాడు.ఇంతలో తన వద్ద రూ.20 వేలు మాయం అయ్యాయని గుర్తించిన ట్రక్ డ్రైవర్... 10 కిలోమీటర్ల దూరం అధికారిని వెంబడించి చివరకు ఓ చోట అతడ్ని పట్టుకుని తన రూ.20 వేలు ఎక్కడ అని నిలదీశాడు. అయితే, తన ఖాకీ పవర్‌తో బెదిరించేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆ ట్రక్ డ్రైవర్ ఏమాత్రం బెదరకుండా ఎదురొడ్డి తన వద్ద కాజేసిన రూ.20 వేలు రికవరీ చేసుకున్నాడు. ఇంతలో పాదాచారులంతా గుమి కూడి పోలీస్ అధికారికు తగిన బుద్ధి చెప్పారు. దీంతో పోలీస్ అధికారి తలదించుకుని వెళ్లిపోయాడు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి, చోరీకి పాల్పడిన పోలీస్ అధికారిపై సస్పెండ్ వేటు వేశారు. అలాగే, అతనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

