Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజాస్వామ్యంలో ఎవరైనా.. ఎక్కడైనా సభలు నిర్వహించుకోవచ్చు: చంద్రబాబు

ప్రజాస్వామ్యంలో ఎవరైనా.. ఎక్కడైనా సభలు నిర్వహించుకోవచ్చు: చంద్రబాబు

హైదరాబాద్‌ నగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సభకు అనుమతి నిరాకరణపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
తెలంగాణలో పవన్‌ కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడైనా సభలు నిర్వహించుకోవచ్చన్నారు. తానూ తమిళనాడుకి వెళ్లి ప్రచారం చేశానని ఆయన గుర్తు చేశారు.

'రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ల సమయం గడిచిపోయింది. ప్రజలకు ఎవరు మంచి చేశారనేది అందరికీ తెలుసు. ప్రజలకు మంచి చేయడంలో నాయకులు పోటీ పడాలి గానీ, ప్రజల మధ్య విభేదాలు తెచ్చేందుకు పోటీపడకూడదు. అభివృద్ధిని లాజికల్‌గా తీసుకెళ్లాలి. అనవసరంగా వివాదాలు సృష్టించడం ఎవరికీ మంచిది కాదు' అని హితవు పలికారు.

డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా ఆరోపణలపై సీఎం స్పందిస్తూ, డీఎస్సీపై విషప్రచారంతో యువతలో గందరగోళం సృష్టించేందుకు వైకాపా ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. బ్రిడ్జ్‌ స్పోర్ట్స్‌పై అవగాహన లేకుండా గొడ్డలి పార్టీ నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నోరు, పేపర్‌, పేటీఎం బ్యాచ్‌ ఉన్నాయని.. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజలు వైకాపా గుర్తింపును రద్దు చేసే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.

రూ.కోట్లు ఉన్నా సంపూర్ణ ఆరోగ్యం లేకపోతే ఏం లాభం : సీఎం చంద్రబాబు

కోట్లాది రూపాయల విలువ చేసే నగదు, నగలు, ఆస్తులున్నప్పటికీ సంపూర్ణ ఆరోగ్యం లేకపోతే ఏం లాభమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో లలిత పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ పేరుతో నిర్మించిన ఆస్పత్రిని ఆయన బుధవారం ప్రారంభిచారు. ఈ సందర్భంగా సీఎం బాబు మాట్లాడుతూ, లలిత ఆస్పత్రి, ల్యాండ్ మార్క్ ఇనిస్టిట్యూట్‌గా తయారు కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.

అలాగే, ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులు. వేల కోట్లు, పదవులు ఉన్నా.. ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. లలిత ఆసుపత్రి 600 పడకల సామర్థ్యంతో 900 మంది సిబ్బందితో ప్రారంభమైంది. 32 విభాగాలకు వైద్య సేవలు అందించే ఏకైక కేంద్రమిది. సంజీవని పేరుతో డిజిటల్ హెల్త్‌ రికార్డు ప్రాజెక్టును తీసుకొస్తున్నాం. పేదవాళ్ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మంచి అలవాట్లతో అనారోగ్యం మన దరి చేరదు. యోగా, ధ్యానం వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. మనం తినే ఆహారమే.. మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది అని చంద్రబాబు తెలిపారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu