Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రతి ఒక్కరికి కష్టాలు కామన్‌గా ఉంటాయి... కానీ : జగపతి బాబు

ప్రతి ఒక్కరికి కష్టాలు కామన్‌గా ఉంటాయి... కానీ : జగపతి బాబు

ప్రతి ఒక్కరికీ కష్టాలు కామన్‌గా ఉంటాయని కానీ, కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుందని ప్రముఖ సినీ హీరో జగపతిబాబు అన్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం పెద్ది.
జూన్ నెల 4వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు.

'సినిమా రంగంలో ఉన్నంత ఆనందం నాకు ఇంక ఎందులోనూ కనిపించదు. ఇందులో ఏదైనా సాధ్యమవుతుంది. సహజంగా నా జీవితంలో ప్రతిదీ ఆలస్యంగా వస్తుంది. కెరీర్‌లో కూడా మొదట ఫ్లాప్‌ల నుంచి హిట్‌లకు వచ్చాను. అందుకే పరాజయాలను పెద్దగా పట్టించుకోను. ఏదో ఒకరోజు విజయం తప్పక వస్తుంది నమ్ముతా. జీవితం మన అంచనాలకు అందదు. తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు.

కానీ, ప్రతి ఒక్కరికి కష్టాలు కామన్‌గా ఉంటాయి. నేనూ ఎన్నో కష్టాలు పడ్డాను. ఇలా జరిగిందేంటని ఎప్పుడూ బాధపడలేదు. వాటి నుంచి ఏదో కొత్త పాఠం నేర్చుకున్నాను. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని ఎప్పుడూ నమ్ముతాను. బాధ వెనక సంతోషం ఖచ్చితంగా ఉంటుంది. నేను 2011 నుంచి 2013 వరకు ఎంతో బాధ అనుభవించా. దానికి తగిన సంతోషం ఇప్పుడు వచ్చింది. నా టైమ్‌ ఇప్పుడు స్టార్ట్‌ అయింది అనుకుంటున్నా' అని జగపతి బాబు అన్నారు.

సినిమాల విషయంలో ఎప్పుడూ ఒత్తిడికి గురి కాలేదని జగపతి బాబు ఈ సందర్భంగా తెలిపారు. ఫ్యామిలీ ఇష్యూ కాకుండా ఇంకా దేనిని పెద్ద సమస్యగా తీసుకోనని అన్నారు. 'పెద్ది'లో తనకు, రామ్ చరణ్‌కు మధ్య ఉండే బంధం అందరికీ నచ్చుతుందన్నారు. చరణ్ అన్ని సినిమాలకు కష్టపడతారని.. ఈ చిత్రంలో శరీరాకృతిని మార్చుకోవడం కోసం మరింత ఎక్కువ శ్రమించారని చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu