తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని, ఆమె ప్రియుడు శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు తండా సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. వారిని గమనించిన మహబూబ్ నగర్‌కు చెందిన అశోక్, లక్ష్మణ్ అనే ఇద్దరు యువకులు వారిని అడ్డగించారు.
తొలుత ప్రేమజంటను బెదిరించి వారి వద్ద ఉన్న రూ.6 వేలు నగదు వసూలు చేసారు. ఆ తర్వాత ప్రియుడుని భయపెట్టి పక్కకు నెట్టేసి బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ సమయంలో ప్రియుడు ధైర్యం చేసి డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, నిందితులను రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ ప్రాంతంలో గంతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఈ కేసులతో ఈ ఇద్దరు నిందితులకు సంబంధం ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

