Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రేమించి దూరం పెట్టిందని టెక్కీని హత్య చేసిన ముగ్గురు పిల్లల తండ్రి!

ప్రేమించి దూరం పెట్టిందని టెక్కీని హత్య చేసిన ముగ్గురు పిల్లల తండ్రి!

పీలోని వెస్ట్ గోదావరి జిల్లాలో ఓ దారుణం జరిగింది. తనను ప్రేమించిన ఓ యువతి.. ఆ తర్వాత నిజాలు తెలుసుకుని దూరం పెట్టడాన్ని ముగ్గురు పిల్లల తండ్రి జీర్ణించుకోలేకపోయాడు.
దీంతో ఆ యువతిపై పగ పెంచుకున్న ఆయన... ఆమెను దారుణంగా హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన యువతి కొత్తపల్లి అనంతవాణి(32) అనే యువతి హైదరాబాద్‌ నగరంలోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తన తల్లి అనారోగ్యంగా ఉండటంతో సుమారు ఏడాది క్రితం స్వగ్రామానికి వచ్చి ఇంటి నుంచి ఉద్యోగం (వర్క్‌ఫ్రం హోం) చేస్తోంది. ఈ క్రమంలో సమీప గ్రామం కొర్రపాడుకు చెందిన ఆటో డ్రైవర్‌ తాడేపల్లి శ్యామ్‌బాబుతో ఆమెకు స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే, శ్యామ్‌బాబుకు గతంలోనే వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తర్వాత తెలుసుకున్న అనంతవాణి షాక్‌కు గురై.. అతన్ని దూరం పెట్టసాగింది.

దీంతో పగ పెంచుకున్న శ్యామ్‌బాబు ఆదివారం తెల్లవారుజామున ఆమె ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తీసిన వెంటనే పదునైన కత్తితో దాడిచేసి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అనంతవాణిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఆమె తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

అనంతవాణి తండ్రి దివ్యాంగుడు, తల్లి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. ఆమె ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులను పోషిస్తున్నారు. బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు కూడా నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని దగ్గరుండి చూసుకునేందుకే స్వగ్రామానికి వచ్చారు. దాడి సమయంలో తల్లిదండ్రులు అక్కడే ఉన్నా అడ్డుకునే స్థితిలో వారు లేరని స్థానికులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu