అనీష్ కుమార్ అనే యువకుడు తెల్లవారుజామునే టవర్ ఎక్కి గంటల తరబడి అక్కడే ఉండిపోయాడు. దీంతో అతడిని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఈ ఘటనలో విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఉదయం 11 గంటల సమయంలో అనీష్ స్వయంగా 112 ఎమర్జెన్సీ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి తన గురించి పోలీసులకు చెప్పాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని డియోరియాకు చెందిన యువతితో తాను ప్రేమలో ఉన్నానని, ఆమెతో తనను కలపకపోతే టవర్ పైనుంచి దూకేస్తానని హెచ్చరించాడు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు పరిపాలనా అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పుణేలో టైల్స్ షాపులో పనిచేసే అనీష్ మంగళవారం పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి ఈ పని చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అధికారులు అతని కుటుంబ సభ్యుల సహాయంతో అనీష్‌కు కౌన్సెలింగ్ ఇస్తూ, సురక్షితంగా కిందకు దించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో గంటల తరబడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

