Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజమౌళి నిర్మాణంలో ఫాంటసీ చిత్రం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ డేట్ ఫిక్స్

రాజమౌళి నిర్మాణంలో ఫాంటసీ చిత్రం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ డేట్ ఫిక్స్

Don't trouble the trouble.

స్టార్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్‌, బాహుబలి మూవీని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్‌, డైరెక్టర్ ఎస్‌.ఎస్‌.రాజమౌళి కలయికలో రూపొందుతోన్న చిత్రం 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'.
షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై తొలిసారి డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రేమలు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఎస్.ఎస్. కార్తికేయ..ఇప్పుడీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను ఇండియన్ సినిమాకు గర్వకారణంగా నిలిచిన బాహుబలి ఫ్రాంచైజీ నిర్మాతలైన ఆర్కా మీడియాతో కలిసి రూపొందిస్తున్నారు.

చిత్రానికి శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో వెర్సటైల్ యాక్టర్‌ ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ కలసి ఈ ఆసక్తికరమైన, కంటెంట్ రిచ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే వినోదాన్ని పంచుతూ ఆసక్తిని రేకెత్తించిన టీజర్ తర్వాత మేకర్స్ 'కేకు వాకు' అనే వీడియో సాంగ్‌కు ఆడియెన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌ను గమనిస్తే ఫహాద్ ఫాజిల్ మెట్లపై కూర్చుని ఉన్నారు. తన పక్కనే చిన్న పాప స్సారా కూర్చుని ఉంది. ఆమె ఓ కలర్ స్టిక్‌ను పట్టుకుని ఇంద్రజాలం చేస్తోంది. డబ్బు వర్షంలా కురుస్తుంది. దాన్ని చూసిన ఫహాద్ ఆనందంతో ఆశ్చర్యపోతున్నారు. 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌' మూవీ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం అక్టోబర్‌2, 2026న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu