రైలు ప్రయాణాలకు దూరంగా ఉండండి : ఇరాన్ పౌరులకు ఇజ్రాయెల్ హెచ్చరిక

రైలు ప్రయాణాలకు దూరంగా ఉండండి : ఇరాన్ పౌరులకు ఇజ్రాయెల్ హెచ్చరిక

వెబ్దునియా

వెబ్దునియా

17hr

Loading...

Iran

రాన్ దేశ పౌరులకు ఇజ్రాయెల్ ఓ హెచ్చరిక చేసింది. రైలు ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్‌‍పై యుద్ధం చేస్తున్న విషయం తెల్సిందే.
ముఖ్యంగా, ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇందులోభాగంగా, ప్రజా రవాణాను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్ దాడులకు తెగబడుతోంది. అదేసమయంలో సాధారణ పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇజ్రాయెల్ ఓ హెచ్చరిక చేసింది. వచ్చే 12 గంటల పాటు రైలు ప్రయాణాలకు, రైలు మార్గాలకు సమీపంలో ఉండే ప్రజలు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలని సూచించింది.

అధికారిక పర్షియన్‌ భాష ఎక్స్‌ ఖాతాలో ఐడీఎఫ్‌ ఈ మేరకు పోస్టు పెట్టింది. ఇరాన్‌ ప్రజలను ఉద్దేశిస్తూ.. 'మీ భద్రత దృష్ట్యా ఇప్పటి నుంచి రాత్రి 9 గంటల వరకు (ఇరాన్‌ కాలమానం ప్రకారం) దేశవ్యాప్తంగా ఉన్న రైళ్ల మార్గాలకు దూరంగా ఉండండి. రైలు ప్రయాణాలు మానుకోవాలని కోరుతున్నాం. ఒకవేళ మీరు అక్కడ ఉంటే.. అది మీ ప్రాణాలకు ప్రమాదం కావొచ్చు' అని రాసుకొచ్చింది. దీన్ని అత్యవసర హెచ్చరికగా పేర్కొంది. ఏ ఏ ప్రాంతాల్లోని రైల్వే మార్గాలు అనే విషయాన్ని ఇజ్రాయెల్‌ స్పష్టంగా వెల్లడించలేదు. కాగా.. ఈ హెచ్చరికలపై ఇరాన్‌ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu

Comments

5
Loading comments...