Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైలు ప్రయాణీకులకు నరకం చూపిస్తున్న హిజ్రాలు, రైల్వే అధికారులు పట్టించుకోరా?

రైలు ప్రయాణీకులకు నరకం చూపిస్తున్న హిజ్రాలు, రైల్వే అధికారులు పట్టించుకోరా?

రైలు ప్రయాణీకులకు హిజ్రాలు నరకం చూపిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైలు ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల వద్దకు హిజ్రాలు వచ్చి తాము అడిగినంత ఇవ్వకుంటే నానా యాగీ చేస్తున్నారు.
కొంతమంది తమవద్ద డబ్బు లేదని చెబితే వారిపై భౌతిక దాడులు సైతం చేస్తున్నారు. తన్నులు తిన్నప్పటికీ డబ్బులు ఇవ్వకపోతే వారిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలంతో దూషించడం చేస్తున్నారు.

వారు చేస్తున్న ఈ చర్యలన్నిటినీ అనునిత్యం సోషల్ మీడియాలో షేర్ అవుతూనే వున్నాయి. మరి ఈ వీడియోలు రైల్వే అధికారుల దృష్టికి రావడంలేదా? ప్రయాణికుల భద్రతపై ఉదాసీన వైఖరి ఎందుకు వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రైలు ప్రయాణీకులపై హిజ్రాల ఆగడాలు మితిమీరుతున్నాయని చాలామంది చెబుతున్న మాట.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu