Dailyhunt
Ramcharan: పెద్ది విడుదల కోసం రామ్ చరణ్ అభిమానులు 30రోజుల వినూత్న ప్రచారం

Ramcharan: పెద్ది విడుదల కోసం రామ్ చరణ్ అభిమానులు 30రోజుల వినూత్న ప్రచారం

Peddi - Ramcharan

రామ్ చరణ్ అభిమానులు పెద్ది సినిమా ప్రచారాన్ని 30రోజులపాటు వినూత్నంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మే 5 నుండి #PeddiCountdownEdits ప్రచారాన్ని ప్రారంభించాయి.
ప్రపంచవ్యాప్త విడుదల వరకు 30 మంది ఎడిటర్లు ప్రతిరోజూ అభిమానులు రూపొందించిన కంటెంట్‌ను పంచుకోనున్నారు. మరోవైపు ఈ సినిమా బిజెనెస్ పరంగా సినిమాపై మంచి ప్రభావాన్ని చూపించనున్నట్లు విశ్లేషకులు తెలియజేస్తున్నారు. రిలీజ్ డేట్ ఆలస్యం అయినా సీడెడ్, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర అలానే నైజాం మార్కెట్ లలో పెద్ది భారీ బిజినెస్ ని చేస్తున్నట్టు తెలుస్తుంది. మేకర్స్ డిమాండ్ చేసిన మేరకి సైతం డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట.

బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ 1980ల నాటి గ్రామీణ క్రీడా నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో రెజ్లర్ పెద్ది పెహల్వాన్‌గా రామ్ చరణ్ నటించగా, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్ సహ నటులుగా ఉన్నారు మరియు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఆర్.ఆర్.ఆర్. తర్వాత భారీ అంచనాల నడుమ అభిమానులు ప్రీమియర్‌ల కోసం సిద్ధమవుతుండగా, వాణిజ్య నిపుణులు ఈ చిత్రం భారీ ఓపెనింగ్‌లను సాధిస్తుందని, తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల షేర్ మరియు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 150 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.


ఈ సినిమాకి వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. కొత్త డేట్ అనౌన్స్ చేసాక రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ది గాడి ఆట మొదలైనట్టు తెలుస్తుంది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu