Dailyhunt
రెస్టారెంట్‌పై దాడి... ఫ్రిజ్‌లో నిల్వ వుంచిన బిర్యానీ ప్యాకెట్ల స్వాధీనం

రెస్టారెంట్‌పై దాడి... ఫ్రిజ్‌లో నిల్వ వుంచిన బిర్యానీ ప్యాకెట్ల స్వాధీనం

chicken biryani

chicken biryani

హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీసులు ఒక రెస్టారెంట్‌పై దాడి చేసి, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన బిర్యానీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆ రెస్టారెంట్ యజమాని, అదే బిర్యానీ ప్యాకెట్లను ఓవెన్‌లో వేడి చేసి తిరిగి విక్రయిస్తూ, వినియోగదారుల ప్రాణాలను ప్రమాదంలో పడవేస్తున్నట్లు గుర్తించారు.

ఈ రెస్టారెంట్ వారు జీడిమెట్లలో బిర్యానీని తయారు చేసి, ఆన్‌లైన్ ఆహార డెలివరీ సేవల ద్వారా బంజారా హిల్స్‌లో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఈ బిర్యానీని లక్కీ బిర్యానీ అండ్ షవార్మా పేరుతో విక్రయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu