Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సహజీవనం చేసే మహిళను వేధిస్తే ఇక జైలే : సుప్రీంకోర్టు

సహజీవనం చేసే మహిళను వేధిస్తే ఇక జైలే : సుప్రీంకోర్టు

హజీవనం చేసే మహిళలను వేధింపులకు గురిచేస్తే జైలుశిక్ష తప్పదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. వివాహిత మహిళలకు భరత్, అతని కుటుంబీకుల క్రూర ప్రవర్తన నుంచి రక్షణ కల్పించే ఐపీసీ 498ఏ పరిధిని సుప్రీంకోర్టు సోమవారం మరింతగా విస్తరించింది.
ఫలితంగా సహజీవనం భాగస్వాములకూ ఈ సెక్షన్ వర్తిస్తుందని స్పష్టంచేసింది.

పరస్పర అంగీకారంతో భార్యాభర్తల్లా ఒక జంట సహజీవనం సాగిస్తుంటే ఆ అనుబంధంలోని మహిళను వేధింపులకు గురిచేసే పురుషుడిపై ఈ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చని జస్టిస్‌ సంజయ్‌ కరోల్, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. వివాహితను భర్త లేదా అతని బంధువుల వేధింపుల నుంచి రక్షించేందుకే ఈ సెక్షన్‌ ఇంతవరకూ పరిమితమైందని, వివాహం లాంటి అనుబంధంలో కొనసాగుతూ ఈ సెక్షన్‌ కింద నేరాభియోగానికి గురైన వ్యక్తుల అరెస్టుకు సంబంధించి చట్టంలోని నియమాలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది.

అయితే ఇలాంటి సంబంధంలో ఉన్న పురుషుడినిగానీ, అతని సంబంధీకులనుగానీ ప్రాథమిక విచారణ జరపకుండా అరెస్టు చేయరాదని నిర్దేశించింది. సహజీవనం జీవిత వాస్తవంగా మారిందని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ ప్రవృత్తి అధికంగా కనిపిస్తోందని, ఇలాంటి బంధంలో ఉన్న వ్యక్తులకు చట్టం వర్తించాలని ధర్మాసనం అభిప్రాయపడింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu