వైసిపి కోసం, జగన్ మోహర్ రెడ్డి గారి కోసం ఎన్నో కష్టాలు పడ్డాము, పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టిన తమను పార్టీ ఆఫీసుకి రావద్దంటారా అంటూ వైసిపి ఆఫీసు ముందు సతీసమేతంగా బైఠాయించాడు బోరుగడ్డ అనిల్.
పార్టీలో 70 శాతం మంది మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేస్తారు. ఇస్త్రీ చొక్కా వేసుకుని కూర్చుని వుంటాడు. పార్టీ జెండా పట్టుకుని నడిచారా ఎప్పుడైనా. మేము జగన్ కోసం ప్రాణాలు ఇస్తాము.
పార్టీ కోసం పని చేసే నన్ను రోడ్డు మీద పడేసారు. ఇప్పుడు నా భార్యతో సహా నేను రోడ్డు మీదికి రావాల్సి వచ్చింది. ఒక చరిత్ర వున్న కుటుంబం మాది. జగనన్న కోసం ప్రాణాలు అర్పించేందుకు మేము సిద్ధం. మాకు నాయకుడు ఎవ్వరూ లేరు. ఒక్క జగన్ మోహన్ రెడ్డి తప్ప. మాకు న్యాయం జరగాలి అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.

