Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సమోసాల కోసం రైలు దిగిన లోకో పైలట్... (వీడియో)

సమోసాల కోసం రైలు దిగిన లోకో పైలట్... (వీడియో)

సమోసాల కోసం లోకో పైలెట్ ఒకరు రైలు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రలోని ముఖ్య నగరాల్లో ఒకటైన ఇండోర్ - మౌ మధ్య డెమో రైలు నడుస్తుంది. ఈ రైలుకు ఇంజనీరింగ్ పనులు కారణంగా సిగ్నల్ ఇవ్వలేదు.

ఆ సమయంలో పక్కనే ఉన్న దుకాణంలో సమోసాలు కొనుగోలు చేసేందుకు లోకో పైలెట్ రైలు దిగి, నేరుగా దుకాణంలోకి వచ్చి సమోసాలు కొనుక్కుని తిరిగి రైలు ఎక్కారు. దీన్ని కొందరు యువకులు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయింది. అయితే, కొందరు స్థానికులు మాత్రం లోకో పైలెట్ కేవలం సమోసాల కోసమే రైలును ఆపాడంటూ చేసిన కామెంట్స్‌ను రైలు అధికారులు కొట్టిపారేశారు. అదేసమయంలో ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu