Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సప్తపది వంటి ఏడు ప్రమాణాలు చేయకపోతే ఆ పెళ్లి చెల్లదు.. గుజరాత్ హైకోర్టు

సప్తపది వంటి ఏడు ప్రమాణాలు చేయకపోతే ఆ పెళ్లి చెల్లదు.. గుజరాత్ హైకోర్టు

Marriage

హిందూ వివాహంలోని ముఖ్యమైన ఆచారాలు, ముఖ్యంగా సప్తపది వంటి ఏడు ప్రమాణాలు చేయకపోతే.. ఆ వివాహం చెల్లదని గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
వివాహం అనేది తేలికైన విషయం కాదని.. ఒక పవిత్ర బంధమని పేర్కొంది. వివాహం అనేది కేవలం పాటలు పాడటానికి, నృత్యాలు చేయడానికి, తినడానికి, తాగడానికి సంబంధించిన సందర్భం కాదని కోర్టు స్పష్టంగా పేర్కొంది.

ఈ కేసు మొత్తం బ్రిటన్‌లో నివసిస్తున్న ఒక వ్యక్తి చేసిన అప్పీలుకు సంబంధించినది. అహ్మదాబాద్‌కు చెందిన ఒక మహిళ, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనను మోసగించి పత్రాలపై సంతకాలు చేయించుకుని, నకిలీ వివాహ ధృవీకరణ పత్రాన్ని సృష్టించిందని అతను ఆరోపించాడు. ఈ కేసు కుటుంబ న్యాయస్థానానికి చేరినప్పుడు, తమ మధ్య ఎలాంటి వివాహ వేడుక జరగలేదని, తాము ఎన్నడూ భార్యాభర్తలుగా జీవించలేదని ఆ మహిళ ఒప్పుకుంది.

ఇందులో విశేషం ఏంటంటే.. తనకు పెళ్లయిందన్న విషయం ఆ వ్యక్తికి తెలియదు. ఆ మహిళ వివాహ ధృవీకరణ పత్రాన్ని అతని తల్లిదండ్రులకు చూపించి, తానే అతని చట్టబద్ధమైన భార్యనని చెప్పుకున్నప్పుడు మాత్రమే అతనికి ఆ విషయం తెలిసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu