సర్వ విఘ్నాలను తొలగించి, సర్వ శుభాలను చేకూర్చుతాడు ఆ మహా గణపతి. అందుకే సర్వ దేవతలను పూజించే ముందు ఆ గణేశుని ప్రార్థిస్తారు. మన జీవితంలో మనం తలపెట్టే కార్యక్రమాలను విజయవంతం చేసే ఆ గణేశుని ప్రార్థిద్దాము.
మహా గణపతిం మనసా స్మరామి
వసిష్ఠ వామ దేవాది వందిత
మహా గణపతిం మనసా స్మరామి
మహా దేవ సుతం గురుగుహ నుతం
మార కోటి ప్రకాశం శాంతం
మహాకావ్య నాటకాది ప్రియం
మూషికవాహన మోదకప్రియం
మహా గణపతిం మనసా స్మరామి
ఈ శ్లోకానికి అర్థం... మహా గణపతిని నేను నా మనస్సుతో స్మరిస్తున్నాను. వసిష్ఠ, వామదేవ వంటి మహర్షులచే పూజించబడినవాడు. మహాదేవుని కుమారుడు. ముత్తుస్వామి దీక్షితుల చేత కీర్తించబడినవాడు. కోటి మన్మథుల కాంతితో ప్రకాశించేవాడు. శాంత స్వరూపుడు. గొప్ప కావ్యాలు, నాటకాలు మొదలైనవి ఇష్టపడేవాడు. ఎలుకను వాహనంగా కలవాడు. మోదకాలను ఇష్టపడేవాడు. ఆ మహా గణపతిని మనసారా స్మరిస్తున్నాను.

