Ceuta
స్పెయిన్‌లోని సెయూటాకు వేలాది మొరాకో వలసదారులు పోటెత్తడంతో భద్రతా బలగాల చర్యలకు దిగారు. దీంతో 45,000 మంది వెనుదిరిగారు. ఇప్పటికే తొక్కిసలాట, నీట మునిగి 67 మంది వలసదారులు మృతి చెందారు.సెయూటా సరిహద్దుకు పోటెత్తిన వలసదారులను నిలువరించేందుకు స్పెయిన్ భద్రతా దళాలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గుంపును చెదరగొట్టేందుకు బాష్పవాయువు గోళాలు, జల ఫిరంగులను ప్రయోగించడంతో పాటు గాలిలోకి హెచ్చరిక కాల్పులు జరిపారు.
ఈ ఆకస్మిక వలసల వెనుక కొన్ని కీలక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం మొరాకో రాజు చిన్నపాటి నేరాలకు పాల్పడిన వేలమంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. అలా విడుదలైన వారి అధిక సంఖ్యలో సరిహద్దు వైపు వచ్చారని పలు కథనాలు వెలువడ్డాయి.
ఈ తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సెయూటాలోని పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

